కొండకోనలు,వాగువంకలు
భయంకరమైన అరణ్యాలు
ఎండి చెదిరిన ఎడారులు
తుఫానులో చిక్కిన నావలవంటి రోజులను
ఎన్ని దాటానో లెక్కలేదు..
ఎడతెగని ప్రయాణం
పుట్టుక నుండి మరణం వరకు
తోలి శ్వాస నుండి దేవుని తుది తీర్పు వరకు
వసంతం నుండి శిశిరం వరకు
భువి నుండి అఖాతం వరకు
వివిధ పదాలు పంచిన వివిధ అనుభవాలతో
ఎద తెగని ప్రయాణం
నను వెలిగించిన కాంతికిరణాలు
నా కన్నిటిని రుచి చూసిన నిసిధులు
ప్రేమపాత్రమైన బంధాలు
ద్రోహం చేసిన అనుబంధాలు
సుఖడుఖాల దోబుసులాతతో
ఎద తెగని ప్రయాణం
నుదుటిన బలవంతాన అడ్డబడిన కలంకతిలకం
తిరిగీ కత్తి అంచు అయి మెరిసిన వ్యక్తిత్వం
నిందాస్తుతులు,శాంతిఅశాంతులు
గెలుపుఓతములు,మనఃస్సాక్షి ఆహాల మధ్య
నిన్న,నేడు,రిపుల ఆటలతో
ఎద తెగని ప్రయాణం
Subscribe to:
Post Comments (Atom)
beauty of life
in every curve you take

No comments:
Post a Comment